రేబర్తిలో ఘనంగా దుర్గా హోమం
మద్దూరు అక్టోబర్ 19, ప్రజా వాణి,
మండలంలోని రేబర్తి గ్రామంలో శ్రీ దుర్గా భవాని యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రామ శ్రేయస్సును కాంక్షిస్తూ ఘనంగా దుర్గా హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా భవాని యూత్ సభ్యులు మాట్లాడుతూ
రేబర్తి గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండి గ్రామం సస్యశ్యామలంగా ఉండాలని, ఎలాంటి ఆపదలు, అనారోగ్యాలు దరిచేరకుండా అమ్మవారి చల్లని చూపు గ్రామంపై ఎల్లవేళలా ఉండాలని కోరుతూ వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఈ హోమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గా భవాని యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.