రేపు వీర బైరాన్ పల్లిలో మెగా ఉచిత వైద్య శిబిరం
గ్రామ సర్పంచ్ బర్మా రాజమల్లయ్య
మద్దూరు అక్టోబర్7, ప్రజా వాణి,
మండలంలోని వీర బైరాన్ పల్లి గ్రామంలో గురువారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల పాటు మెడిసిటీ హాస్పటల్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఆవరణలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు గ్రామ సర్పంచ్ బర్మా రాజమల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మెగా ఉచిత వైద్య శిబిరంలో అధిక సంఖ్యలో గ్రామస్థులు పాల్గొని అవసరమైన పరీక్షలు చేసుకొని ఉచిత మందులు తీసుకోవాలని ఆయన కోరారు.