prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 October 2026, 2:04 pm Digital Edition : PRAJA VANI

రేపు పట్టభద్రుల ఎమ్మెల్సీ సమన్వయ సమావేశం – భారీగా తరలిరావాలి

రేపు పట్టభద్రుల ఎమ్మెల్సీ సమన్వయ సమావేశం – భారీగా తరలిరావాలి..

పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, పాలకుర్తి ఇంచార్జి హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 14(ప్రజావాణి): వరంగల్-ఖమ్మం-నల్గొండపట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా సమన్వయ సమావేశం అక్టోబర్ 15న (గురువారం) ఉదయం 11 గంటలకు మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్‌లో నిర్వహించనున్నట్లు పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, పాలకుర్తి ఇంచార్జి హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి గార్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డితో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, టీపీసీసీ నాయకులు పాల్గొంటారని పేర్కొన్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, ఈ సమన్వయ సమావేశానికి పాలకుర్తి నియోజకవర్గంలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీల ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.