రేపు కుల్కచర్ల పోచమ్మ ఆలయానికి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ ముఖ్య నేతల రాక
పరిగి, అక్టోబర్ 16(ప్రజావాణి )
మండల కేంద్రంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని రేపు (ఆదివారం, అక్టోబర్ 18) స్థానిక శ్రీ శ్రీ పోచమ్మ తల్లి ఆలయ దర్శనానికి చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు విచ్చేయనున్నారని బీజేపీ మండల అధ్యక్షుడు గుడాల వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కరణం ప్రహ్లాదన్న, బీజేపీ జిల్లా అధ్యక్షుడు యు. రమేష్ కుమార్ కూడా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు గుడాల వెంకటేష్ మాట్లాడుతూ.. పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్ఛార్జ్లు, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ దర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.