**రెండు వర్గాలుగా చీలిన మహిళ బతుకమ్మ సంబరాలు**
*చీకట్లో బతుకమ్మ సంబరాలు *
*విద్యుత్తు సౌకర్యం ఏర్పాట్లు చేయడంలో అనధికారిక సలహాలు తీసుకోవడంతోనే విఫలమైన గ్రామపంచాయతీ పాలకవర్గం *
ప్రజా వాణి రిపోర్టర్ నర్సింహులపేట అక్టోబర్ 18
మేజర్ గ్రామపంచాయతీ మండల కేంద్రంలో 2 బతుకమ్మ ఘాట్లలో మౌలిక వసతులు ఏర్పాటు చేయడం కొరకు సుమారు రెండు లక్షల రూపాయలు వెచ్చించి మొరం జంగల్ కటింగ్, విద్యుత్తు లైట్ల ఏర్పాటు కొరకు పాలకవర్గం కేటాయించింది, రెండు బతుకమ్మ ఘాట్లలో ఒకటి బంధం చెరువు బతుకమ్మ ఘాటు మహిళలు వెళ్లడానికి దూర భారం కావడం వలన గ్రామంలోని కొద్ది మంది మహిళలే బంధం చెరువు బతుకమ్మ ఘాటు కాడికి వెళ్ళగా అక్కడ సరైన విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో మహిళలు ఎంతో ఆనందంతో ఉత్సాహంగా బతుకమ్మ ఆడదామని వెళ్లగా అక్కడ విద్యుత్ సౌకర్యం విఫలం కావడంతో మహిళలు అసంతృప్తి వ్యక్తం చేశారు, రెండవ బతుకమ్మ ఘాటైన గంగాయకుంట వద్ద పాలకవర్గం ఎలాంటి విద్యుత్ సౌకర్యం గాని సౌండ్ సిస్టం గాని ఏర్పాటు చేయకపోవడంతో, అక్కడికి వెళ్లిన మహిళలే మనిషికి కొంత అమౌంట్ జమ చేసుకొని విద్యుత్తు లైట్లు సౌండ్ సిస్టం ఏర్పాటు చేసుకొని చాలిచాలని విద్యుత్ కాంతులతో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు, గ్రామంలోని ఏ మహిళను బతుకమ్మ ఏర్పాట్లు గురించి అడగగా గ్రామపంచాయతీ పాలకవర్గం పూర్తిగా విఫలమైందని అవగాహన లేమి తోనే ఇలాంటి సమస్య తలెత్తిందని చెప్పడం మహిళల వంతైంది.
దసరా రోజు జరిగే భారీ ఉత్సవాలలో విద్యుత్ సమస్యలు రాకుండా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పాలకవర్గం మంచి ప్రణాళికలతో ఏర్పాట్లు చేయాలని గ్రామ మహిళలు కోరుతున్నారు.