prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 October 2026, 4:42 pm Digital Edition : PRAJA VANI

రూ.45 లక్షలతో లక్ష లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్ నిర్మాణం

రూ.45 లక్షలతో లక్ష లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్ నిర్మాణం
శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూసుమంచి అక్టోబర్ 11 ప్రజావాణి: గ్రామ ప్రజలకు మెరుగైన తాగునీటి సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కూసుమంచి మండలంలోని జజ్జులరావుపేట గ్రామంలో రూ.45 లక్షల వ్యయంతో లక్ష లీటర్ల సామర్థ్యం గల ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత రెండున్నరేళ్లలో జజ్జులరావుపేట గ్రామంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ.16.50 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలతో ప్రజలకు అండగా నిలుస్తోందన్నారు.
రానున్న రోజుల్లో గ్రామంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణంతో గ్రామ ప్రజలకు తాగునీటి సరఫరా మరింత మెరుగుపడనుంది.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బజ్జూరి వెంకటరెడ్డి, కాంగ్రెస్ నాయకులు కంచర్ల జీవన్‌రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు కలకొండ పున్నయ్య, సర్పంచ్ దాట్ల సతీష్, ఉపసర్పంచ్ మార్గం గంగాభవాని, పాలకవర్గ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.