prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 October 2026, 6:11 am Digital Edition : PRAJA VANI

రూ. 30,100లకు దుర్గామాత ముక్కుపుడక, పట్టు వస్త్రాలు కైవసం

రూ. 30,100లకు దుర్గామాత ముక్కుపుడక, పట్టు వస్త్రాలు కైవసం
– భక్తిశ్రద్ధలతో దక్కించుకున్న గోవా సునీత-శ్రీనివాసులు దంపతులు
– హర్షం వ్యక్తం చేసిన 11వ వార్డు సభ్యులు మోత్కూర్ వెంకటేష్
–
పరిగి /కులకచర్ల, అక్టోబర్ 20(ప్రజావాణి ):

కులకచర్ల మండల కేంద్రంలోని అంతెలేని గుట్ట (11వ వార్డు) శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా ముగిశాయి. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని భవానీ దుర్గామాత విగ్రహం వద్ద నిర్వహించిన ప్రత్యేక వేలంపాటలో అమ్మవారి ముక్కుపుడక, పట్టు వస్త్రాలను గోవా సునీత-శ్రీనివాసులు దంపతులు రూ. 30,100 చెల్లించి దక్కించుకున్నారు.
ఈ సందర్భంగా 11వ వార్డు సభ్యులు మోత్కూర్ వెంకటేష్ మాట్లాడుతూ, తన సోదరి గోవా సునీత-శ్రీనివాసులు కుటుంబం వేలంపాటలో అమ్మవారి పవిత్ర వస్త్రాలు, ముక్కుపుడకను కైవసం చేసుకోవడం ఎంతో సంతోషాన్ని, గర్వాన్ని కలిగించిందన్నారు. ఇది తమ కుటుంబానికి దక్కిన పరమ పవిత్రమైన అదృష్టమని, జగన్మాత చల్లని ఆశీస్సులు తమ కుటుంబంతో పాటు మండల ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. విజయదశమి ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, విజయాలు నింపాలని, అంతా ఐకమత్యంతో వర్ధిల్లాలని కోరారు.
ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు శివ, సంతోష్, చందు, రాఘవేంద్ర చారి, శ్రీకాంత్, మల్లేష్‌లతో పాటు వార్డు ప్రజలు, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.