రీసర్వే పనులను నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం గడువులోగా పూర్తి చేయాలి…!
అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి
ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి
జిల్లాలో చేపడుతున్న రీసర్వే పనులను ప్రభుత్వ మార్గదర్శకాలు, నిర్దేశిత నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహిస్తూ, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. శ్రీనివాస రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు.
బుధవారం ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలం లచ్చగూడెం రెవెన్యూ గ్రామంలో నిర్వహిస్తున్న రీసర్వే పనులను అదనపు కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
రీసర్వే ప్రక్రియ పురోగతిని సమీక్షించి, సర్వే పనులు సక్రమంగా నిర్వహించేలా సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ రీసర్వే పనులను నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని, ఎలాంటి జాప్యం లేకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. సర్వే ప్రక్రియలో సంబంధిత భూముల వివరాలను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తూ, రికార్డుల ప్రకారం సర్వే పనులు చేపట్టాలని తెలిపారు.
రీసర్వే నిర్వహించే తేదీ, సమయం గురించి సంబంధిత రైతులకు ముందుగానే సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. సర్వే సమయంలో రైతులు తమ భూముల వద్ద అందుబాటులో ఉండేలా చూడాలని, తద్వారా భూముల హద్దులు, ఇతర వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు.
రైతులకు ముందస్తు సమాచారం అందించడంలో నిర్లక్ష్యం వహించరాదని, సర్వే ప్రక్రియలో రైతుల భాగస్వామ్యాన్ని నిర్ధారించాలని సూచించారు. రీసర్వేకు సంబంధించిన పనులను సమన్వయంతో నిర్వహిస్తూ, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు తెలిపారు.
రీసర్వే ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించాలని, పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ నిర్దేశిత కాలపరిమితిలో సర్వే పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు.
ఈ పర్యటనలో అదనపు కలెక్టర్ వెంట చింతకాని మండల తహసీల్దార్ కరుణశ్రీ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

