రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మునిగొండ శేఖర్
మేడ్చల్ ప్రజావాణి: తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా బీసీ సెల్ కన్వీనర్ మునిగొండ శేఖర్ విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మునిగొండ శేఖర్ మాట్లాడుతూ.. విజయదశమి పండుగ చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ పవిత్ర పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలు, సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని, ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని కోరుకున్నారు.
విజయదశమి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ కష్టాలను అధిగమిస్తూ, తమ లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. సమాజంలో ప్రేమ, సోదరభావం, ఐకమత్యం పెంపొందించుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, ప్రతి ప్రయత్నంలో విజయం చేకూరాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు మరోసారి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.
