రాష్ట్రస్థాయి మాక్ పార్లమెంట్‌కు..
నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ఎంపిక
ప్రజావాణి,నెల్లికుదురు:జిల్లా కేంద్రం మహబూబాబాద్ లోని ఐడీఓసీ లో బుధవారం (సెప్టెంబర్ 30)నిర్వహించిన పీఎం శ్రీ పాఠశాలల జిల్లాస్థాయి మాక్ పార్లమెంట్ కార్యక్రమంలో నెల్లికుదురు పీఎం శ్రీ తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్& జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.
జిల్లా నుంచి రాష్ట్రస్థాయి మాక్ పార్లమెంట్‌కు ఐదుగురు విద్యార్థులు ఎంపిక కాగా, వారిలో నెల్లికుదురు మోడల్ స్కూల్‌కు చెందిన ఎస్. దీక్షిత్, సిరివెన్నెల ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్. దీక్షిత్ ప్రధానమంత్రి పాత్రను, సిరివెన్నెల కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి పాత్రను పోషించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ జి. ఉపేందర్ రావు మాట్లాడుతూ, జిల్లా నుంచి ఎంపికైన ఐదుగురిలో ఇద్దరు తమ పాఠశాల విద్యార్థులు కావడం ఎంతో ఆనందంగా ఉందని, ఇది పాఠశాలకు గర్వకారణమని తెలిపారు.
*గైడ్ టీచర్ అంజుమ్ సుల్తానాకు అభినందన*
జిల్లాస్థాయి మాక్ పార్లమెంట్ లో అసాధారణ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించిన ఉపాధ్యాయురాలు ఎం.ఏ. అంజుమ్ సుల్తానాను ప్రిన్సిపాల్ ఉపేందర్ రావు అభినందించారు.
సంబంధిత కార్యక్రమాలు విద్యార్థుల్లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై అవగాహన, నాయకత్వ లక్షణాలు, చర్చా నైపుణ్యాలు, బాధ్యతాయుత పౌరసత్వ భావనను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులు రాష్ట్రస్థాయిలోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.