రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు ఎంపికైన హసన్‌పర్తి విద్యార్థినులు

రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు ఎంపికైన హసన్‌పర్తి విద్యార్థినులు! క్రీడల్లో ప్రతిభ చాటిన విద్యార్థినులకు అభినందనలు తెలిపిన 66వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొర్రె కిరణ్ కుమార్ హసన్‌పర్తి, మన ప్రజావాణి న్యూస్: రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు హసన్‌పర్తి ప్రాంతానికి చెందిన విద్యార్థినులు ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. ఇటీవల నిర్వహించిన 70వ రాష్ట్రస్థాయి పాఠశాల క్రీడా సమాఖ్య (ఎస్‌జీఎఫ్‌) అండర్‌-17 ఉమ్మడి వరంగల్ జిల్లా బాలబాలికల బాస్కెట్‌బాల్ పోటీల్లో విద్యార్థినులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోని బోడుప్పల్‌లో...