prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 11:36 am Digital Edition : PRAJA VANI

రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడల్లో సత్తా చాటిన ఏసిపి మాధవి

రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడల్లో సత్తా చాటిన ఏసిపి మాధవి ఘనంగా సన్మానించిన సీఐ రామకృష్ణ పోలీస్ సిబ్బంది

* ఏసిపి మాధవి, ప్రత్యర్థులకు గట్టి పోటీనిస్తూ నాలుగు స్వర్ణ (గోల్డ్) పతకాలు, ఒక రజత (సిల్వర్) పతకాన్ని సాధించి క్రీడా ప్రాంగణంలో అందరి ప్రశంసలు

జమ్మికుంట అక్టోబర్ 02 (ప్రజావాణి)

ఇటీవల ఎంతో ఘనంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడా పోటీల్లో హుజూరాబాద్ సబ్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసిపి) మాధవి అసాధారణ ప్రతిభను కనబరిచి శాఖకు ఎనలేని పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చారు. హోరాహోరీగా సాగిన వివిధ క్రీడాంశాల్లో ఆమె అత్యుత్తమ ప్రదర్శనతో ఏకంగా ఐదు పతకాలను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ విభాగాల్లో తనదైన శైలిలో రాణించిన ఏసిపి మాధవి, ప్రత్యర్థులకు గట్టి పోటీనిస్తూ నాలుగు స్వర్ణ (గోల్డ్) పతకాలు, ఒక రజత (సిల్వర్) పతకాన్ని సాధించి క్రీడా ప్రాంగణంలో అందరి ప్రశంసలు అందుకున్నారు.ఏసిపి మాధవి సాధించిన ఈ ఘన విజయాన్ని పురస్కరించుకుని జమ్మికుంట పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో జమ్మికుంట సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సీఐ రామకృష్ణ, జమ్మికుంట పట్టణ పోలీస్ సిబ్బంది కలిసి ఏసిపి మాధవిని పూలమాలలు, శాలువాతో ఘనంగా సత్కరించారు అనంతరం ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా సీఐ రామకృష్ణ మాట్లాడుతూ రాత్రింబవళ్ళు శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం బిజీగా ఉంటూ తీవ్ర ఒత్తిడితో కూడిన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నప్పటికీ, క్రీడల పట్ల మక్కువతో సాధన చేసి రాష్ట్రస్థాయి పోటీల్లో ఏకంగా ఐదు పతకాలు సాధించడం సామాన్యమైన విషయం కాదని కొనియాడారు. క్రీడల్లో ఏసిపి మాధవి కనబరిచిన గెలుపు పిలుపు, పట్టుదల పోలీస్ శాఖలోని ప్రతి ఒక్కరికీ ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని, ఆమె విజయం సిబ్బందిలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట పోలీస్ స్టేషన్ ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని ఏసిపి కు శుభాకాంక్షలు తెలిపారు