prajavaani.net
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 8:46 pm Digital Edition : PRAJA VANI

రాయికల్ మండలం కిష్టంపేట నుండి టిప్పర్ల ద్వారా జోరుగా మట్టి తరలింపు

*రాయికల్ మండలం కిష్టంపేట నుండి టిప్పర్ల ద్వారా జోరుగా మట్టి తరలింపు…*

*రాయికల్, అక్టోబర్ 06 (ప్రజావాణి):*

రాయికల్ మండలంలోని కిష్టంపేట గ్రామ శివారు నుండి అక్రమంగా మట్టిని తవ్వి టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత కొద్ది రోజులుగా రాత్రి, పగలు తేడా లేకుండా టిప్పర్లతో మట్టిని తరలిస్తుండటంతో రోడ్లు దుమ్ము, ధూళితో నిండిపోయాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోతున్నారు.అనుమతులు లేకుండానే పెద్ద ఎత్తున మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని, దీని వల్ల పర్యావరణానికి, వ్యవసాయ భూములకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టిప్పర్ల రాకపోకలతో రోడ్లు దెబ్బతింటున్నాయని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.ఇప్పటికైనా సంబంధిత రెవెన్యూ, మైనింగ్ అధికారులు స్పందించి కిష్టంపేటలో జరుగుతున్న మట్టి తరలింపుపై విచారణ జరిపి, అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.