రాయికల్ మండలంలో ప్రతి గ్రామంలో యథేచ్ఛగా బెల్ట్ షాపులు – చోద్యం చూస్తున్న ఆబ్కారీ శాఖ

*రాయికల్ మండలంలో ప్రతి గ్రామంలో యథేచ్ఛగా బెల్ట్ షాపులు - చోద్యం చూస్తున్న ఆబ్కారీ శాఖ?* *రాయికల్, అక్టోబర్ 13 (ప్రజావాణి):* రాయికల్ మండలంలో బెల్ట్ షాపుల దందా హద్దు దాటింది. మండలంలోని ఏ గ్రామానికి వెళ్లినా కిరాణా దుకాణాలు, టీ స్టాళ్లలో సైతం విచ్చలవిడిగా మద్యం ఏరులై పారుతోంది. అక్రమ మద్యాన్ని అరికట్టాల్సిన ఆబ్కారీ శాఖ అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.మండలంలోని అన్ని గ్రామాల్లో అధికారిక అనుమతి లేకుండా బెల్ట్ షాపులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి...