రాయరావు చెరువులో వ్యక్తి మృతదేహం లభ్యం
రాయరావు చెరువులో వ్యక్తి మృతదేహం లభ్యం నర్సాపూర్, అక్టోబర్ 2 (మన సమగ్ర ప్రజావాణి): నర్సాపూర్ పట్టణ సమీపంలోని రాయరావు చెరువులో ఓ వ్యక్తి మృతదేహం నీటిపై తేలుతూ కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. చెరువులో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు చెరువులోకి ఎలా వచ్చాడు? ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందాడా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు...