prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 4:16 pm Digital Edition : PRAJA VANI

రాయరావు చెరువులో వ్యక్తి మృతదేహం లభ్యం

రాయరావు చెరువులో వ్యక్తి మృతదేహం లభ్యం

నర్సాపూర్, అక్టోబర్ 2 (మన సమగ్ర ప్రజావాణి):
నర్సాపూర్ పట్టణ సమీపంలోని రాయరావు చెరువులో ఓ వ్యక్తి మృతదేహం నీటిపై తేలుతూ కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది.

చెరువులో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు చెరువులోకి ఎలా వచ్చాడు? ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందాడా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మృతుడు నర్సాపూర్ పట్టణానికి చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు. అయితే మృతుడి పూర్తి వివరాలు, మృతికి గల కారణాలు అధికారికంగా తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.