రామోజీనాయక్ తండాలో కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ప్రారంభోత్సవం.*
*ప్రారంభించిన జిల్లా కోర్టు కార్యదర్శి మాధవి లత.*
*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 05*
యాదాద్రి భువనగిరి
జిల్లా తుర్కపల్లి మండలం రామోజీనాయక్ తండ గ్రామంలో జాతీయన్యాయ సేవ అధికార సంస్థ , తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు మెగా డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా సోమవారం రోజు జిల్లా పరిపాలన , విద్యా శాఖ , జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ , యాదాద్రి భువనగిరి జిల్లా
సంయుక్తంగా గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను పునః ప్రారంభించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ , గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ సహకారంతో గ్రామంలో కుట్టు మిషన్ శిక్షణను గ్రామంలోని మహిళల కోసం ప్రారంభించారు. ఈ
కార్యక్రమంలో న్యాయ మూర్తి , జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి వి. మాధవి లత , విద్యా శాఖ అధికారులు సి.యం.ఒ పి. లింగారెడ్డి , యం.ఇ.ఓ రాణి , ప్రాథ మిక పాఠశాల హెడ్ మాస్టర్ వేణు , మాదాపూర్ ప్రభుత్వ పాఠశాల హెచ్.యం. మాలతి , అదనపు పి.డి , డి.ఆర్.డి.ఒ కె. జంగా రెడ్డి , గ్రామ సర్పంచ్ బి. సతీష్ , ఉపసర్పంచ్ రాములు , శిక్షణా సంస్థ డైరెక్టర్ కిషన్ , ఇన్ స్ట్రక్టర్ శ్రీనివాస్ , గ్రామ ప్రతీ తల్లి తండ్రి తమ పిల్లలను ప్రాథమిక పాఠశాలకు పంపాలని , మహిళలు కుట్టు మిషన్ శిక్షణను సద్వినియోగం చేసు కోవాలని తెలిపారు.