రాములు కుటుంబానికి గౌడ సంఘం చేయూత
రాములు కుటుంబానికి గౌడ సంఘం చేయూత ప్రజావాణి,ఇనుగుర్తి:ఇటీవల కన్నుమూసిన బండారి రాములు కుటుంబానికి మండల కేంద్రం ఇనుగుర్తి కి చెందిన కౌండిన్య గౌడ సంక్షేమ సంఘం రూ.2,500 ఆర్థిక సహాయం అందించింది.ఈ సందర్భంగా రాములు చిత్రపటానికి పూలమాలలు వేసి సంఘం ప్రతినిధులు నివాళులర్పించారు. సంఘం అధ్యక్షులు కూటికంటి మధు గౌడ్ మాట్లాడుతూ రాములు అకాల కన్నుమూత బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఆపద సమయం లోనూ ధైర్యాన్ని కోల్పో వద్దని ధైర్య వచనాలు చెప్పారు.అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో...