రాములు కుటుంబానికి గౌడ సంఘం చేయూత
ప్రజావాణి,ఇనుగుర్తి:ఇటీవల కన్నుమూసిన బండారి రాములు కుటుంబానికి మండల కేంద్రం ఇనుగుర్తి కి చెందిన కౌండిన్య గౌడ సంక్షేమ సంఘం రూ.2,500 ఆర్థిక సహాయం అందించింది.ఈ సందర్భంగా రాములు చిత్రపటానికి పూలమాలలు వేసి సంఘం ప్రతినిధులు నివాళులర్పించారు. సంఘం అధ్యక్షులు కూటికంటి మధు గౌడ్ మాట్లాడుతూ రాములు అకాల కన్నుమూత బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఆపద సమయం లోనూ ధైర్యాన్ని కోల్పో వద్దని ధైర్య వచనాలు చెప్పారు.అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు వేముల శ్రీనివాస్,బండారి మధు,బుర్ర సుధాకర్,గడ్డం శ్రీకాంత్,బుర్ర సందీప్, వేముల రాకేష్, బొమ్మేర మహేష్, గడ్డం సునీల్, గండు రాము,బండారి సది,నరేష్ తదితరులు పాల్గొన్నారు.
*ట్రాక్టర్స్ యూనియన్ సహకారం..*
రాములు అకాల కన్నుమూతకు ఇనుగుర్తి ట్రాక్టర్స్ యూనియన్ విచారం వ్యక్తం చేసింది.రాములు కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేశారు. కార్యక్రమంలోఉప సర్పంచి సత్తూరి యాదగిరి,యూనియన్ ప్రతినిధులు కొంతం శ్రీను,గంజి యాకూబ్ రెడ్డి,వెంకన్న,కొంతం వెంకన్న, జాటోత్ కిషన్,బొబ్బిలి వేముల రెడ్డి, చిన్నాల పరశురాం,ఐలయ్య,బొల్లు రామకృష్ణ,కావటి ప్రదీప్,బండారి వెంకన్న తదితరులు పాల్గొన్నారు