కలసపాడు మండలం అక్టోబర్ 1 ప్రజావాణి రామాపురం గ్రామంలో అంగన్‌వాడీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కలసపాడు సెక్టార్ సూపర్‌వైజర్ హరిప్రియ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బద్వేల్ అఎంసీ చైర్‌పర్సన్ నారిశెట్టి సుప్రజ హాజరై అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను అభినందించారు.కలసపాడు మండల ఇన్‌చార్జ్ నారోజు రమణ చారి ఆహ్వానం మేరకు కార్యక్రమానికి హాజరైన నారిశెట్టి సుప్రజ అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లను ఘనంగా సన్మానించారు. అలాగే ఐసీడీస్ సీడీపీవో లక్ష్మి, కలసపాడు సూపర్‌వైజర్ హరిప్రియలను ప్రత్యేకంగా సన్మానించారు.ఈ సందర్భంగా బద్వేల్ అఎంసీ చైర్‌పర్సన్ నారిశెట్టి సుప్రజ మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు అందిస్తున్న సేవలు ఎంతో ప్రశంసనీయమని అన్నారు. చిన్నారుల పోషణ, ఆరోగ్యం, విద్యాభివృద్ధికి అంగన్‌వాడీ సిబ్బంది చేస్తున్న కృషిని అభినందించారు. అంగన్‌వాడీ వ్యవస్థ బలోపేతానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సహకారం, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ఆమె కొనియాడారు. అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు సమాజంలో కీలకమైన సేవలు అందిస్తున్నారని, వారి సేవలను ప్రతి ఒక్కరూ గుర్తించాలని అన్నారు.ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం, పోషణ, విద్యాభివృద్ధికి అంగన్‌వాడీ సిబ్బంది అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని కొనియాడారు. ముఖ్యంగా కలసపాడు మండలంలో అంగన్‌వాడీ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న సూపర్‌వైజర్ హరిప్రియ సేవలను అభినందించారు. అధికారులు అందిస్తున్న సహకారాన్ని ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో బద్వేల్ చైర్‌పర్సన్ నారిశెట్టి సుప్రజ, బీజేపీ నాయకులు దుల్లా శ్రీనివాసరెడ్డి, నాగేంద్ర, సూపర్‌వైజర్లు రత్నకుమారి, మాధవి, కాశినాయన సూపర్‌వైజర్ చంద్రకళ తదితరులు, గ్రామ ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.నారోజు రమణ చారి ఆధ్వర్యంలో జరిగిన ఈ అంగన్‌వాడీ ఉత్సవాలు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగాయి.