prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 6:33 pm Digital Edition : PRAJA VANI

రామచంద్ర యాదవ్ కుమ్మకు రాజకీయాలు

రామచంద్ర యాదవ్ కుమ్మకు రాజకీయాలు

ప్రజావాణి, అక్టోబర్ 17:

సదుం: పుంగనూరులో వైఎస్సార్ సీపీ నామినేషన్ల సందర్భంగా అలజడులు సృష్టించిది ఎవరో బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ కు తెలిసీ అసత్యాలు ప్రచారం చేయడం ఎందుకని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి ప్రశ్నించారు. శనివారం ఆయన మండల కేంద్రంలో మాట్లాడుతూ.. అర్ధరాత్రి పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి కుట్రలు పన్నుతుండగా తాను చూసానని చెప్పడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చేసిన పూజల వల్ల వచ్చిన మహిమలతో ఏమైనా గ్రహించారా అని అడిగారు. గత ఎన్నికలలో సదుంలో ఆయన పోలీస్ స్టేషన్లో లో ఉండగా అల్లర్లు చోటు చేసుకుంటే తమ చొరవతోనే బయటపడ్డ సంగతి తెలియదా అని చెప్పారు. టీడీపీతో కుమ్మక్కు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆలజడులు సృష్టిస్తుంటే పార్టీ అధినేతగా ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. పుంగనూరులో అధికారం బలంతో బయట ప్రాంతాల వ్యక్తులతో దాడి చేసినా.. తమపైనే ఆయన విమర్శలు చేయడం అవివేకమన్నారు. కేవలం ఎమ్మల్యే పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ పై విమర్శలు చేస్తూ అవాస్తవాలు ప్రచారం చేయడం ఆయన స్థాయికి తగదన్నారు. కాషాయ వస్త్రాలు ధరించి అబద్ధాలు చెప్పడం ఆయనకే చెల్లిందన్నారు. ఓపార్టీకి రాష్ట్ర అధినేత అయినా టీడీపీకి మేలు చేసేందుకే పుంగనూరు మున్సిపాలిటీలో పోటీ చేయడం లేదా లేక అభ్యర్లును నిలబెట్టలేని శక్తిహీనుడో చెప్పాలన్నారు.