prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 October 2026, 8:32 am Digital Edition : PRAJA VANI

రామచంద్రాపురంలో కూలిన స్లాబ్ ఒకరికి గాయాలు

రామచంద్రాపురంలో కూలిన స్లాబ్ ఒకరికి గాయాలు

అక్టోబర్ 24.ప్రజావాణి న్యూస్ /సంగెం

సంగెం మండలంలోని రామచంద్రాపురం గ్రామంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కత్తుల సమ్మయ్య యాదవ్కు చెందిన స్లాబ్ ఇల్లు ఒక్కసారిగా కూలిపోయింది.ఈ ప్రమాదం జరిగిన సమయంలో సమ్మయ్య యాదవ్ ఇంట్లోనే ఉండటంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన స్థానికులు ఆయనను చికిత్స నిమిత్తం వరంగల్ ఆసుపత్రికి తరలించారు.ప్రమాద సమయంలో ఇంట్లో మిగతా కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో ఒక పెద్ద ప్రాణాపాయం తప్పిందని గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.కాగా ఇల్లు కూలిపోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడిందని,ప్రభుత్వం తక్షణమే స్పందించి సమ్మయ్య యాదవ్ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ పులి రమేష్ గౌడ్ అధికారులను కోరారు.