prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 October 2026, 7:34 pm Digital Edition : PRAJA VANI

రాజ్యాంగ పరిరక్షణకు ప్రజాస్వామిక వాదులు ఐక్యం కావాలి

రాజ్యాంగ పరిరక్షణకు ప్రజాస్వామిక వాదులు ఐక్యం కావాలి

భారత రాజ్యాంగ పరిరక్షణ చైతన్య వేదిక హుస్నాబాద్ చైర్మన్ కవ్వ లక్ష్మారెడ్డి

ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-

భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజాస్వామిక వాదులు ప్రజా సంఘాల నాయకులు మేధావులు ఐక్యంగా ముందుకు రావాలని భారత రాజ్యాంగ పరిరక్షణ చైతన్య వేదిక హుస్నాబాద్ చైర్మన్ కవ్వ లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఎల్కతుర్తి అంబేడ్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉందని కుల మత లింగ వివక్షలకు తావులేకుండా సామాన్య ప్రజల హక్కులను పరిరక్షించే లక్ష్యంతో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆలోచనా విధానాల ఆధారంగా రూపుదిద్దుకున్న రాజ్యాంగాన్ని బలహీనపరిచేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఇలాంటి ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్లోని ప్రజాస్వామ్యవాదులు ప్రజా సంఘాల ప్రతినిధులు ఒకే వేదికపైకి వచ్చి రాజ్యాంగ పరిరక్షణ కోసం ఐక్యంగా ఉద్యమించాలని కోరారు.
ఈ సందర్భంగా భారత రాజ్యాంగ పరిరక్షణ చైతన్య వేదిక మండల కమిటీ ఏర్పాటు గురువారం ఉదయం 11 గంటల కు మండల కేంద్రంలో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేసే ప్రజాస్వామ్యవాదులు ప్రజా సంఘాల నాయకులు మేధావులు.బహుజన సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కవ్వ లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డేగల సారయ్య సాతూరి చంద్రమౌళి చదిరం నాగేశ్వర్ అడ్డూరి అనిల్ బొంకురి రాజ్,గొల్లపల్లి రవి,బొంకురి వంశీ తదితరులు పాల్గొన్నారు.