రాజారాంపల్లిలో దారుణం.. పాతకక్షల నేపథ్యంలో యువకుడి హత్య

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి అక్టోబర్ 19 (ప్రజావాణి): జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామ శివారులోని పాతగూడూరు చౌరస్తా వద్ద అర్ధరాత్రి జరిగిన కత్తిపోట్ల దాడిలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అక్రమ సంబంధం నేపథ్యంలో తలెత్తిన ఘర్షణలే ఈ హత్యకు దారితీసినట్లు పోలీసులు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా సుద్దాల గ్రామానికి చెందిన బొంతు మల్లయ్య ప్రస్తుతం ధర్మారం మండల కేంద్రంలో నివాసం ఉంటున్నాడు. గత కొద్ది రోజులుగా బొంతు మల్లయ్య భార్యకు, ధర్మారానికి చెందిన శివరాత్రి మల్లేష్ (40)...