రాక్ హిల్స్ కాలనీలో ఘనంగా శ్రీ శ్రీ శ్రీ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
నల్గొండ జిల్లాలోని రోడ్డు నెంబర్ 5 రాక్ హిల్స్ కాలనీలో శ్రీ శ్రీ శ్రీ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కాలనీలో దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్టించి, రంగు రంగుల విద్యుత్ దీపాలతో, పూలతో అలంకరించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని, పూజలు చేస్తున్నారు. ప్రతి రోజూ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, హారతులు, భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
కమిటీ సభ్యులు మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాలను కాలనీ వాసులంతా కలిసి ఐక్యతతో జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతున్నారు.