*రజక వృత్తిదారులకు రక్షణ చట్టం చేయాలి*
*తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫైళ్ల ఆశయ్య*
* *మన ప్రజావాణి* *మందమర్రి*:-
రజక వృత్తిదారులకు రక్షణ చట్టం చేయాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫైళ్ల ఆశయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలోని సీఐటీయు బ్రాంచ్ కార్యాలయంలో బుధవారం సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ అధ్యక్షతన నిర్వహించిన రజక వృత్తిదారుల సంఘం 26వ ఆవిర్భావ దినోత్సవ సభ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ముందుగా పట్టణంలో సంఘం జెండాను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆశయ్య మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో 10 లక్షల మందికి పైగా ఉన్న రజక వృత్తిదారులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారని, ప్రభుత్వాలు మారుతున్నా వారి బతుకుల్లో మార్పు రావడం లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలైన మోడరన్ దోబీ ఘాట్ల నిర్మాణం, రజక వృత్తిదారులకు 10 లక్షల రూపాయల రుణాలు, 50 ఏళ్లు నిండిన వారికి పెన్షన్, రక్షణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకుడు పాయిరాల రాములు, పట్టణ అధ్యక్షుడు గంగరాజుల రామచందర్, ఉపాధ్యక్షులు బండి పాపయ్య, ముష్కి చందర్, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సాంబారు వెంకటస్వామి, కొత్తకొండ నరసయ్య, మండల అధ్యక్షుడు ఓదెలు, బాలయ్య, సంగెపు హనుమంతు, గుడికందుల సమ్మయ్య, తరిగొప్పుల భాగ్య, రాజేశ్వరి, కళావతి, కంచర్ల రాజమల్లు, చంద్రగిరి రమేష్, తోటపల్లి రమేష్, తంగేళ్లపల్లి కనకయ్య, రాంబాబు, గుడికందుల మల్లయ్య లు పాల్గొన్నారు.