prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 October 2026, 7:39 pm Digital Edition : PRAJA VANI

రక్తదానం చేయండి.. ప్రాణదాతలు కండి

రక్తదానం చేయండి.. ప్రాణదాతలు కండి!
మంత్రి పొంగులేటి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం
కాంగ్రెస్ శ్రేణులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలి: మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బజ్జూరి వెంకటరెడ్డి
కూసుమంచి, అక్టోబర్ 23 (ప్రజావాణి) ప్రతినిధి RK:
రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడాలని, తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు అండగా నిలవాలని కూసుమంచి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బజ్జూరి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 28వ తేదీ, బుధవారం కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు నిరంతరం రక్తం అవసరమవుతుందని, అలాంటి వారికి రక్తాన్ని అందించడం ద్వారా ప్రాణదాతలుగా నిలిచే అవకాశం ఉందని పేర్కొన్నారు. రక్తదానం చేయడం ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని కోరారు.
ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, యువత, మంత్రి అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయాలని బజ్జూరి వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఒక్కరి రక్తదానం.. మరొకరికి ప్రాణదానం కావచ్చు. రక్తదానం చేయండి.. ప్రాణాలను కాపాడండి!