రంగసముద్రం స్కూల్ విద్యా కమిటీ చైర్మన్‌గా కాకర్ల సుబ్బరాయుడు ఏకగ్రీవం:
పోరుమామిళ్ల అక్టోబర్ 05 ప్రజావాణి రంగసముద్రం ప్రభుత్వ పాఠశాల విద్యా కమిటీ (గ్రామ విద్యా కమిటీ) చైర్మన్‌గా నూతనంగా ఎన్నికైన కాకర్ల సుబ్బరాయుడు సోమవారం గ్రామానికి చెందిన ప్రముఖ నాయకులు, వైఎస్సార్సీపీ సీనియర్ నేత, రంగసముద్రం మాజీ సర్పంచ్ చిత్తా రవిప్రకాశ్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.గ్రామ పెద్దలు, వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులతో కలిసి వెళ్లిన నూతన చైర్మన్ సుబ్బరాయుడుకు మాజీ సర్పంచ్ చిత్తా రవిప్రకాశ్ రెడ్డి,యువ నాయకులు ఘన స్వాగతం పలికారు.ఈ భేటీ గ్రామ రాజకీయాల్లో,విద్యా వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. పెద్దల...