పోరుమామిళ్ల అక్టోబర్ 05 ప్రజావాణి రంగసముద్రం ప్రభుత్వ పాఠశాల విద్యా కమిటీ (గ్రామ విద్యా కమిటీ) చైర్మన్‌గా నూతనంగా ఎన్నికైన కాకర్ల సుబ్బరాయుడు సోమవారం గ్రామానికి చెందిన ప్రముఖ నాయకులు, వైఎస్సార్సీపీ సీనియర్ నేత, రంగసముద్రం మాజీ సర్పంచ్ చిత్తా రవిప్రకాశ్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.గ్రామ పెద్దలు, వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులతో కలిసి వెళ్లిన నూతన చైర్మన్ సుబ్బరాయుడుకు మాజీ సర్పంచ్ చిత్తా రవిప్రకాశ్ రెడ్డి,యువ నాయకులు ఘన స్వాగతం పలికారు.ఈ భేటీ గ్రామ రాజకీయాల్లో,విద్యా వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
పెద్దల మద్దతుతోనే చైర్మన్ పదవి: కాకర్ల సుబ్బరాయుడు
ఈ సందర్భంగా నూతన చైర్మన్ కాకర్ల సుబ్బరాయుడు మాట్లాడుతూ.రంగసముద్రం గ్రామ పెద్దలందరి సంపూర్ణ ఆశీస్సులు,మద్దతుతోనే తాను ఈ బాధ్యతాయుతమైన పదవికి ఎన్నుకోబడ్డానని ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మాజీ సర్పంచ్ చిత్తా రవిప్రకాశ్ రెడ్డి చూపిన చొరవ, అందించిన సహకారం మరువలేనిదని కొనియాడారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను అన్ని రంగాల్లో ముందంజలో ఉంచేందుకు, విద్యార్థులకు మెరుగైన వసతులు,నాణ్యమైన విద్య అందేలా చూసేందుకు తన వంతు శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తనపై నమ్మకం ఉంచి ఈ పదవికి ఏకగ్రీవంగా ఎంపిక చేసినందుకు మాజీ సర్పంచ్‌కు, గ్రామ పెద్దలకు, వైఎస్సార్సీపీ శ్రేణులకు ప్రత్యేకంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
పాఠశాల సమగ్ర అభివృద్ధికి అండగా ఉంటాం: చిత్తా రవిప్రకాశ్ రెడ్డి
రంగసముద్రం మాజీ సర్పంచ్ చిత్తా రవిప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.గ్రామంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు,పాఠశాల ప్రగతిని కాంక్షిస్తూ గ్రామ పెద్దలందరూ సమిష్టిగా, ఏకాభిప్రాయంతో ఆలోచించి కాకర్ల సుబ్బరాయుడు పేరును చైర్మన్‌గా సూచించారని తెలిపారు.సుబ్బరాయుడు నాయకత్వంలో పాఠశాల మరింత అభివృద్ధి పథంలో పయనిస్తుందనే నమ్మకం తమకు ఉందన్నారు.రాబోయే రోజుల్లో పాఠశాల మౌలిక వసతుల కల్పన, విద్యా ప్రమాణాల పెంపుదల కోసం నూతన చైర్మన్ చేపట్టబోయే ప్రతి ఒక్క మంచి కార్యక్రమానికి, అభివృద్ధి పనులకు తమ వంతు సంపూర్ణ సహకారం, రాజకీయ అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయని భరోసా ఇచ్చారు.అనంతరం కాకర్ల సుబ్బరాయుడును చిత్తా రవిప్రకాశ్ రెడ్డి శాలువా కప్పి, పూలమాల వేసి ఘనంగా సత్కరించి, శుభాకాంక్షలు అందజేశారు.
పెద్ద ఎత్తున హాజరైన వైఎస్సార్సీపీ శ్రేణులు, గ్రామ ప్రముఖులు:
గ్రామ ప్రాధాన్యత కలిగిన ఈ మర్యాదపూర్వక సమావేశంలో వైఎస్సార్సీపీ మద్దతుదారులు, స్థానిక నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.పాల్గొన్న వారిలో మాజీ జెడ్పీటీసీ ముత్యాల ప్రసాద్, వైఎస్సార్సీపీ యువ నాయకులు చిత్తా గిరి ప్రణీత్ రెడ్డి,సాయి నారాయణ రెడ్డి, రఘునాథరెడ్డి, పెద్ద సుబ్బారెడ్డి,శ్రీరామ్ రెడ్డి,హుస్సేన్ రెడ్డి, చెన్నారెడ్డి,సుబ్బారెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,హుస్సేన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజా రెడ్డి,తులసి సురేష్, ప్రసన్న, ఆదర్శ రైతు బాల్రెడ్డి తదితర వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు,విద్యా కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దలు ఉన్నారు. నూతన చైర్మన్ ఆధ్వర్యంలో రంగసముద్రం స్కూల్ జిల్లాలోనే ఆదర్శంగా నిలవాలని వారు ఈ సందర్భంగా ఆకాంక్షించారు.