రంకెలేసిన రంగసముద్రం.. వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా చిత్తగిరి ప్రణీత్ రెడ్డి నామినేషన్ గ్రాండ్ సక్సెస్!
పోరుమామిళ్ల: అక్టోబర్24 ప్రజావాణి అధిష్టానం పిలుపు మేరకు, కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని రంగసముద్రం పంచాయతీ ఎంపీటీసీ అభ్యర్థిగా చిత్తగిరి ప్రణీత్ రెడ్డి తన నామినేషన్ను విజయవంతంగా దాఖలు చేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆయన తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా ప్రణీత్ రెడ్డి రంగంలోకి దిగడంతో రంగసముద్రం రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ నామినేషన్ కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మరియు చిత్తగిరి ప్రణీత్ రెడ్డి అభిమానులు, గ్రామ...