*యువతిని ప్రేమ పేరుతో వేధించిన వ్యక్తి అరెస్ట్*
••నిందితుడిపై రౌడీషీట్ తెరుస్తాం
••సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్ర చారి
ఎల్లారెడ్డిపేట, ప్రజావాణి
ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన ఓ యువతిని ప్రేమ పేరుతో గత కొన్ని రోజులుగా వెంటాడుతూ, అసభ్యకరంగా ప్రవర్తించిన జుబేర్ (ఎల్లారెడ్డిపేట)పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సిరిసిల్ల డీఎస్పీ కే. నాగేంద్ర చారి తెలిపారు.నిందితుడు జుబేర్‌పై గతంలో హుజూరాబాద్‌లో పోక్సో కేసు నమోదైందని, ఆ కేసులో జైలుకు వెళ్లి వచ్చినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. అతని నేర ప్రవర్తనను పరిగణనలోకి తీసుకొని రౌడీషీట్ తెరవనున్నట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఉద్వేగాలకు లోనుకాకుండా సంయమనం పాటించాలని, పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. ఎవరూ చట్టాన్ని అతిక్రమించి ప్రవర్తించవద్దని హెచ్చరించారు.ఇక్కడ రూరల్ సీఐ వెంకటేష్, ఎస్సై రమేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.