యాసంగికి సబ్సిడీపై శనగ విత్తనాలు

యాసంగికి సబ్సిడీపై శనగ విత్తనాలు బెజ్జంకి మండలానికి 93 బస్తాల కేటాయింపు బెజ్జంకి, అక్టోబర్ 3 (ప్రజావాణి) జాతీయ ఆహార భద్రత, పోషణ మిషన్‌లో భాగంగా యాసంగి–2026 సీజన్‌కు శనగ విత్తనాలను సబ్సిడీపై రైతులకు అందుబాటులో ఉంచినట్లు మండల వ్యవసాయ అధికారి సంతోష్ తెలిపారు. సిద్దిపేట జిల్లా వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో బెజ్జంకి మండలానికి 93 బస్తాల శనగ విత్తనాలు కేటాయించినట్లు పేర్కొన్నారు. నంద్యాల గ్రామ్‌ (NBeG-452) రకం విత్తనాలు ఒక్కో ప్యాకెట్‌లో 16 కిలోలు ఉంటాయని తెలిపారు. వీటి పూర్తి ధర రూ.1,392...