prajavaani.net
Newspaper Banner
Date of Publish : 09 October 2026, 3:44 pm Digital Edition : PRAJA VANI

యాదాద్రి జిల్లా ప్రజలకు బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు

*యాదాద్రి జిల్లా ప్రజలకు బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు…*

*కుంటలు చెరువుల వద్ద జాగ్రత్తగా ఉండాలి.*

*అపరిచిత వ్యక్తులను నమ్మరాదు..ఊర్లకు వెళ్లేవాళ్లు సమాచారం ఇవ్వాలి.*

*యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఐపిఎస్.*

*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 09*

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలకు ముందస్తుగా బతుకమ్మ , దసరా పండుగల శుభాకాంక్షలు తెలియజేస్తూ..పండుగల సమయంలో ఊర్లకు వెళ్లే ప్రయాణికులు ఒకటి , రెండు రోజుల ముందుగానే ప్లాన్ చేసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఐపిఎస్ సూచించారు. జాతీయ రహదారులపై వాహనాల రద్దీని నియంత్రించేందుకు బీబీ నగర్ , పంతంగి టోల్ ప్లాజాల వద్ద తగినంత పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసి ట్రాఫిక్ ను జిల్లా ట్రాఫిక్ డిఎస్పి ప్రభాకర్ రెడ్డితో కలిసి పర్యవేక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. రహదారి నిర్మాణ పనులు జరుగు తున్న ప్రాంతాల్లో అప్ర మత్తంగా ఉండాలని , అతి వేగం , రాంగ్ రూట్ డ్రైవింగ్ , ప్రమాదకరమైన ఓవర్ టేకింగు దూరంగా ఉండాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ , కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ ను తప్పనిసరిగా ధరించాలని , మద్యం సేవించి వాహనాలు నడపవద్దని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రాధాన్యత అని , ఊర్లకు వెళ్లే ముందు ఇంటికి తాళాలు వేసి మరి పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని , ఇంటి లోపల లైట్ వేసి ఉంచాలని , ఇరుగు పొరుగు వారికి ఇంటిపై ఒక కన్నేసి పెట్టమని చెప్పాలని సూచిస్తూ అలాగే ట్రాఫిక్ నిబంధ నలు పాటిస్తూ సురక్షితం గా ప్రయాణించాలని జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలకు ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఐపిఎస్ విజ్ఞప్తి చేశారు.