యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ గడువులోగా నిర్మాణాలు పూర్తి చేయాల్సిందే…!
రాష్ట్ర రెవెన్యూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి
వచ్చే జూన్ కల్లా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాలు పూర్తిచేసి, అందుబాటులోకి తేవాలని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ లో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను క్షేత్ర స్థాయిలో మంత్రి, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి పరిశీలించారు.
నిర్మాణాల్లో 4 ఆకాడమిక్ బ్లాకుల్లో ఒక బ్లాక్ స్లాబ్ లెవల్, రెండు బ్లాకులు బేస్మెంట్ స్థాయిలో ఉండగా, ఒక బ్లాక్ పనులు ఇంకనూ ప్రారంభించలేదని అన్నారు.

సీనియర్ హాస్టళ్లు 9 లో, ఒక హాస్టళ్లు జి ప్లస్ 1 స్లాబ్ పూర్తవగా, 5 హాస్టళ్ల నిర్మాణాలు బేస్ మెంట్ వరకు జరిగాయని, 3 హాస్టళ్లు ఇంకా పనులు ప్రారంభం కాలేదని అన్నారు. కిచెన్, డైనింగ్ హాల్ నిర్మాణాలు పురోగతిలో ఉన్నట్లు తెలిపారు.
నిర్మాణ పనుల్లో ఎక్కడ ఆలస్యం అలసత్వం ఉండకూడదని గుత్తేదారులకు, అధికారులకు తెలిపారు. యంగ్ ఇండియా పాఠశాల పనులను మరింత వేగవంతం చేయాలని గుత్తేదారులను ఆదేశించారు. నిర్మాణ కార్మికుల సంఖ్యను పెంచుకుని, పనులను మరింత వేగవంతం చేసి, జూన్ కల్లా పూర్తి స్థాయిలో పూర్తి చేయాలన్నారు.
విద్య ద్వారానే సమాజంలో గుర్తింపు, గౌరవం దక్కుతుందని, ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తుందని మంత్రి అన్నారు. అక్షరమే ఆయుధంగా మలుచుకొని తెలంగాణ బిడ్డలు చదువుకొని బాగా ఎదగాలన్నారు. అక్షరం ద్వారానే అంతరాలు లేని సమాజ నిర్మాణం అవుతుందన్నారు. 
ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ఇఇ బుగ్గయ్య, ఆర్ అండ్ ఎస్ ఈ యుగంధర్ రావు, పిఆర్ ఎస్ఈ వెంకట్ రెడ్డి, హౌజింగ్ పిడి భూక్యా శ్రీనివాస్, ఖమ్మం ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, ఖమ్మం రూరల్ మండల తహసీల్దార్ వినయెoదర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.