prajavaani.net
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 6:32 pm Digital Edition : NNARSINGARAO GATKESKAR

మోదీ జన్మదినం సందర్భంగా బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో అంగన్వాడీ, ఆశా వర్కర్లకు ఆత్మీయ సత్కారం

 

కీసర, అక్టోబర్ 6 (ప్రజా లక్): ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా కీసర డివిజన్‌లోని చీర్యాల గ్రామంలో అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లకు ఆత్మీయ సత్కారం నిర్వహించారు. కీసర డివిజన్ అధ్యక్షుడు కోల బాలరాజు య బీజేపీ జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్, బీఅతిథులుగా హాజరయ్యరూ

ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజల ఆరోగ్యం, మహిళలు, చిన్నారుల సంక్షేమం కోసం అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని పేర్కొన్నారు. వారి సేవలను గుర్తించి గౌరవించడం అభినందనీయమని అన్నారు.

అంగన్వాడీ, ఆశా వర్కర్లు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆరోగ్యం, పోషణ, మహిళలు, చిన్నారుల సంక్షేమం కోసం నిరంతరం సేవలందిస్తున్నారని నాయకులు కొనియాడారు. సేవా సంకల్ప్ అభియాన్ ద్వారా సమాజంలోని వివిధ వర్గాలను గౌరవిస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సింగిరెడ్డి వెంకట్‌రెడ్డి, జిల్లాల తిరుమలరెడ్డి, డివిజన్ ఇన్‌చార్జి జగన్ గౌడ్, జిల్లా కార్యదర్శి బోడ శ్రీనివాసరావు, మహిళా మోర్చా అధ్యక్షురాలు సంధ్యారెడ్డి, ప్రగతి, లిఖిత, జిల్లా కార్యవర్గ సభ్యులు ఏలూరి సత్యనారాయణ, కన్వీనర్ ఉమారెడ్డి, శాలిని, డివిజన్ నాయకులు నాగరాజు, కోల మహేందర్, కోల మల్లేష్, పొట్ట ఆంజనేయులు, నవీన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కీసర మండలంలోని అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.