మొండివర్రే ఎస్సీ కాలనీలో బస్టాండ్ నిర్మించాలి

*మొండివర్రే ఎస్సీ కాలనీలో బస్టాండ్ నిర్మించాలి.* *దమ్మపేట ఎంపీడీవోకు వినతిపత్రం అందజేసిన మద్దిశెట్టి సామేలు* దమ్మపేట, అక్టోబర్ 12 (మన ప్రజావాణి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల పరిధిలోని మొండివర్రే ఎస్సీ కాలనీలో బస్టాండ్ నిర్మించాలని కోరుతూ మద్దిశెట్టి సామేలు, పలువురు నాయకులతో కలిసి దమ్మపేట ఎంపీడీవోకి వినతిపత్రం అందజేశారు. మొండివర్రే ఎస్సీ కాలనీలో సుమారు 200 కుటుంబాలు నివసిస్తున్నాయని, అయినప్పటికీ ఇప్పటివరకు అక్కడ బస్టాండ్ ఏర్పాటు చేయకపోవడం విచారకరమని వారు పేర్కొన్నారు. బస్సుల కోసం వేచి ఉండే ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను...