prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 October 2026, 7:40 pm Digital Edition : PRAJA VANI

మొండివర్రే ఎస్సీ కాలనీలో బస్టాండ్ నిర్మించాలి

*మొండివర్రే ఎస్సీ కాలనీలో బస్టాండ్ నిర్మించాలి.*

*దమ్మపేట ఎంపీడీవోకు వినతిపత్రం అందజేసిన మద్దిశెట్టి సామేలు*

దమ్మపేట, అక్టోబర్ 12 (మన ప్రజావాణి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల పరిధిలోని మొండివర్రే ఎస్సీ కాలనీలో బస్టాండ్ నిర్మించాలని కోరుతూ మద్దిశెట్టి సామేలు, పలువురు నాయకులతో కలిసి దమ్మపేట ఎంపీడీవోకి వినతిపత్రం అందజేశారు. మొండివర్రే ఎస్సీ కాలనీలో సుమారు 200 కుటుంబాలు నివసిస్తున్నాయని, అయినప్పటికీ ఇప్పటివరకు అక్కడ బస్టాండ్ ఏర్పాటు చేయకపోవడం విచారకరమని వారు పేర్కొన్నారు. బస్సుల కోసం వేచి ఉండే ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, కాలనీలో వీలైనంత త్వరగా బస్టాండ్ నిర్మాణం చేపట్టాలని ఎంపీడీవోను కోరారు. ఈ వినతిపై ఎంపీడీవో సానుకూలంగా స్పందిస్తూ, సమస్య పరిష్కారానికి వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలగాని శ్రీనివాస్ గౌడ్, తాటి రాములు తదితరులు పాల్గొన్నారు.