prajavaani.net
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 8:09 pm Digital Edition : SURENDHAR MAHEBUBABAD

మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ను కలెక్టర్ ఆకస్మిక తనికి

మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ను కలెక్టర్ ఆకస్మిక తనికి

జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్*

తొర్రూరు
అక్టోబర్ 6

స్థానిక మండల కేంద్రంలో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుచున్న మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో జిల్లా స్నేహ శబరీష్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు,
ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో మాట్లాడుతూ వారికి అందిస్తున్న సౌకర్యాలు విద్య బోధనలు, డైట్ మెనూ, యూనిఫామ్, నోట్ బుక్స్, తదితర అంశాలపై వివరంగా అడిగి తెలుసుకున్నారు, ప్రతి క్లాస్ రూమ్ తిరుగుతూ విద్య బోధనలను పరిశీలించారు.
స్టోర్ గదిని పరిశీలించి నిత్యవసర వస్తువుల యొక్క నాణ్యత, గడువు తేదీలను పరిశీలించారు, స్టోర్ రిజిస్టర్ ను చెక్ చేశారు, ప్రభుత్వం కల్పిస్తున్న పక్క డైట్ మెనూ ఖచ్చితంగా అమలు చేయాలని నాణ్యమైన ఆహార పదార్థాలతో వేడివేడి ఆహారాన్ని అందించాలని, వంట సిద్ధం చేసే సిబ్బందికి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని, తగిన జాగ్రత్తలు పాటిస్తూ వంటలు సిద్ధం చేయాలన్నారు, కిచెన్ షెడ్యూలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తరగతి గదులలో నిరంతరం విద్యుత్, స్వచ్ఛమైన త్రాగునీరు అంతరాయం లేకుండా చూసుకోవాలన్నారు.
పిల్లలకు ఆరోగ్య సమస్యలు రాకుండా ముందస్తుగా వారిని గమనిస్తూ ఉండాలని మానసిక స్థితిగతులను శిక్షణ తరగతుల నివారి నిర్వహించాలని తెలిపారు, నూతన విద్యా విధానం టెక్నాలజీ డిజిటల్ తరగతులు నిర్వహించి అత్యుత్తమ ఫలితాలను సాధించడం కోసం కృషి చేయాలని తెలిపారు, ప్రతి సబ్జెక్టు తోపాటు ఇంగ్లీష్ సబ్జెక్టు పై ప్రావీణ్యత వచ్చే విధంగా ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు,
పిల్లలకు షెడ్యూలు ప్రకారం తరగతులు నిర్వహించాలని టెస్ట్ , నోట్స్ బుక్కులు, యూనిఫార్ములు అందించాలని, సూచించారు.
వసతి గృహం ప్రాంగణంలో ఫిర్యాదుల బాక్సును ఏర్పాటు చేయాలని అట్టి తాళపు చెవి ప్రత్యేక అధికారి వద్ద ఉండాలని తెలిపారు,
ఈ పర్యటనలో కలెక్టర్ వెంట మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిని నాగలక్ష్మి, తొర్రూరు ఆర్డీవో గణేష్, తాహశీ ల్దార్ గడీల శ్రీనివాస్, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్, వక్కాల శ్యాంసుందర్ ఎం పి ఓ, మైనార్టీ పాఠశాల ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు.