prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 October 2026, 6:09 pm Digital Edition : MAHESH MEDCHAL

మైనర్ బాలికలపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి రెండేళ్ల కఠిన కారాగార శిక్ష

మైనర్ బాలికలపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి రెండేళ్ల కఠిన కారాగార శిక్ష

మేడ్చల్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు తీర్పు.. రూ.1,000 జరిమానా

మేడ్చల్: మైనర్ బాలికలను వెంటాడుతూ, అసభ్యకర వీడియోలు చూపించి లైంగికంగా వేధించిన కేసులో నిందితుడికి మేడ్చల్‌లోని ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానం రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ మేరకు గురువారం (అక్టోబర్ 15, 2026) కోర్టు తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళితే.. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో బొల్లారం దాకూరి దశరథ్ (49), సుభాష్‌నగర్, అల్వాల్ నివాసి, ఇద్దరు బాధితులను వెంటాడుతూ, పురుషులు, మహిళలకు సంబంధించిన నగ్న వీడియోలు చూపించి లైంగికంగా వేధించినట్లు కేసు నమోదైంది. ఈ కేసును విచారించిన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మేడ్చల్‌లోని అత్యాచార, పోక్సో కేసుల సత్వర విచారణ కోసం ఏర్పాటు చేసిన ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానం నిందితుడికి పోక్సో చట్టంలోని సెక్షన్ 11(iii)తో పాటు సెక్షన్ 12 కింద రెండేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.1,000 జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా రెండు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొంది. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ప్రభాకర్ రెడ్డి వ్యవహరించారు.