మైనర్ బాలికపై ఐదుగురు యువకులు లైంగిక దాడి
పోలీసుల అదుపులో ఐదుగురు
యువకులు
కేసు నమోదు చేసిన మద్దూరు పోలీసులు
మద్దూరు అక్టోబర్22, ప్రజా వాణి,
దూలిమిట్ట మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికపై పక్క గ్రామానికి చెందిన ఐదుగురు సామూహికంగా లైంగిక దాడికి పాల్పడినట్లు విశ్వసనీయ వర్గాల ద్వార సమాచారం ప్రకారం దసరా పండుగ రోజున రాత్రి 10 గంటలకు బాలికను పొరుగు గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు బైకులపై తీసుకెళ్లి నిర్జన ప్రదేశంలో లైంగిక దాడికి పాల్పడినట్లు తేలిసింది. అనంతరం బుదవారం ఉదయం 3గంటల సమయంలో బాలికను తన ఇంటి వద్ద వదిలి వెళ్లినట్లు సమాచారం దీంతో ఈ రోజు అంత ఎటు వెళ్ళావు అని తల్లి దండ్రులు ఇంట్లో మందలించడంతో జరిగిన విషయం చెప్పడంతో తల్లిదండ్రులు పోలీసులకు పిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.