prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 October 2026, 6:18 pm Digital Edition : PRAJA VANI

మేదరిపేటలో ఆటో–బైక్ ఢీ.. యువకుడికి తీవ్ర గాయాలు

మేదరిపేటలో ఆటో–బైక్ ఢీ
యువకుడికి తీవ్ర గాయాలు.. 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలింపు
దండేపల్లి, అక్టోబర్ 28 (ప్రజావాణి):
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మేదరిపేట సినిమా థియేటర్ సమీపంలో బుధవారం ఆటో, బైక్ ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
వివరాల్లోకి వెళ్తే.. మేదరిపేటకు చెందిన ఆడెపు రవీందర్ నడుపుతున్న ఆటో, కోర్విచెల్మ (రాజ్యంపేట) గ్రామానికి చెందిన కోవా రమేష్ ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న కోవా రమేష్ తీవ్రంగా గాయపడ్డాడు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా, అంబులెన్స్ సిబ్బంది గాయపడిన రమేష్‌ను లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉండగా, ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు సేకరిస్తున్నట్లు సమాచారం.