మేడ్చల్ సర్కిల్లో మౌలిక వసతుల పనులపై కమిషనర్ క్షేత్రస్థాయి పరిశీలన
డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి
మేడ్చల్: మేడ్చల్ సర్కిల్ పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధి పనులను మున్సిపల్ కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శనివారం ఉదయం జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, ఇంజినీరింగ్ విభాగం అధికారులతో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించి, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మేడ్చల్ బస్టాప్ వద్ద నీరు నిల్వ ఉండే సమస్యను పరిష్కరించేందుకు ప్రతిపాదించిన బాక్స్ డ్రెయిన్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ ప్రాంతంలో డ్రైనేజీ సమస్యలు, నీటి నిల్వకు గల కారణాలను సమీక్షించి, సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం శివాజీ విగ్రహం జంక్షన్ వద్ద కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి, పనుల పురోగతిని సమీక్షించారు. అలాగే కేఎల్ఆర్ పార్కు అభివృద్ధికి ప్రతిపాదించిన స్థలాన్ని సందర్శించి, అక్కడ చేపట్టాల్సిన పనులపై అధికారు
లతో చర్చించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా డ్రైనేజీ సమస్యలను పరిష్కరించడంతోపాటు, ప్రతిపాదిత మౌలిక వసతుల పనులపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు. అభివృద్ధి పనుల విషయంలో సమన్వయంతో ముందుకు సాగుతూ, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.