మేడ్చల్ డివిజన్ పరిధిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

*మేడ్చల్‌లో వైభవంగా బతుకమ్మ ఉత్సవాలు* *ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు.. ఆటపాటలతో సందడి చేసిన మహిళలు* మేడ్చల్, నేటి ప్రస్థానం:- తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు మేడ్చల్ పట్టణంలో అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత రామన్నగారి రాఘవేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొని ఆటపాటలతో పండుగ సంబరాలను జరుపుకున్నారు....