prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 4:48 pm Digital Edition : MAHESH MEDCHAL

మేడ్చల్ డిపోలో టీజేఎంయూ విజయోత్సవ సంబరాలు

*మేడ్చల్ డిపోలో టీజేఎంయూ విజయోత్సవ సంబరాలు*

*కార్మిక సంఘం ఎన్నికల్లో గౌరారం జగన్ గౌడ్, డిపో సెక్రెటరీగా శ్రీనివాస్ విజయం*

మేడ్చల్ అక్టోబర్ 17 (పీపుల్స్ డైరీ):- మేడ్చల్ ఆర్టీసీ డిపోలో తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టీజేఎంయూ) కార్మిక సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా శనివారం డిపో వద్ద విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. యూనియన్ అధ్యక్షుడిగా గౌరారం జగన్ గౌడ్, డిపో కార్యదర్శిగా శ్రీనివాస్ విజయం సాధించడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కార్మికులు టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల్లో విజయం సాధించిన నాయకులను శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మికుల ఐక్యత, సంఘటిత శక్తికి ఈ విజయం నిదర్శనమని పలువురు నాయకులు పేర్కొన్నారు.

*టీజేఎంయూ నూతన కార్యవర్గం*

ఎన్నికల్లో వివిధ బాధ్యతలకు ఎంపికైన వారిలో గౌరవ అధ్యక్షుడిగా గౌరారం జగన్ గౌడ్, డిపో అధ్యక్షుడిగా నర్సింహా, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సాదిక్ పాషా, ఉపాధ్యక్షులుగా టి.సి. శేఖర్, సునీత, డిపో కార్యదర్శిగా శ్రీనివాస్ ఎన్నికయ్యారు.
అలాగే గ్యారేజ్ కార్యదర్శిగా గణపతి, గ్యారేజ్ అధ్యక్షుడిగా సంతోష్, జాయింట్ సెక్రటరీగా తాహేర్ హుస్సేన్, చీఫ్ అడ్వైజర్‌గా వెంకటేష్, అడ్వైజర్‌గా శశిరాజ్ బాధ్యతలు చేపట్టనున్నారు. వీరితో పాటు రఘువీర్ రాజు, వెంకటేష్, రాజేందర్ తదితరులు యూనియన్ కార్యకలాపాల్లో భాగస్వాములు కానున్నారు.

*కార్మికుల సంక్షేమానికి నిరంతరం కృషి చేయాలి*

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కార్మికుల సమస్యల పరిష్కారం, వారి హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం నూతన కార్యవర్గం సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు. కార్మికుల సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఎన్నికల్లో విజయం సాధించిన నాయకులకు పలువురు కార్మికులు, నాయకులు అభినందనలు తెలిపారు. ఈ విజయోత్సవ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రామన్నగారి శ్రీనివాస్ గౌడ్, చెరువుకొమ్ము శ్రీనివాస్ గౌడ్, ఎల్లంపేట్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్, బీజేపీ ప్రధాన కార్యదర్శి జాకట ప్రేమ్ దాస్, బీజేవైఎం జిల్లా మాజీ కార్యదర్శి రాఘవ రెడ్డి, డివిజన్ బీజేపీ కార్యదర్శి బండి విష్ణు గౌడ్, బీజేపీ నాయకులు వంశీ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, సుధాకర్ గౌడ్, రాజేష్, బాల్ రెడ్డి, గోపు నాగరాజ్, ఈశ్వర్, బాబు రాజ్, గౌలికర్ మహేష్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.