మేడ్చల్ జిల్లాలో ఐదు 2బీ బార్ల కేటాయింపు
*మేడ్చల్ జిల్లాలో ఐదు 2బీ బార్ల కేటాయింపు* *లాటరీ ద్వారా ఐదుగురు అభ్యర్థుల ఎంపిక* *కలెక్టర్ మను చౌదరి సమక్షంలో పారదర్శకంగా లాటరీ ప్రక్రియ* మేడ్చల్:- మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలోని మూడు మున్సిపాలిటీల్లో 2బీ బార్ల కేటాయింపునకు నిర్వహించిన లాటరీ ప్రక్రియలో ఐదుగురు అభ్యర్థులు ఎంపికయ్యారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు జిల్లా కార్యాలయ సముదాయంలో జిల్లా కలెక్టర్ మను చౌదరి, ఐఏఎస్ సమక్షంలో ఈ లాటరీ ప్రక్రియ నిర్వహించారు. అలియాబాద్, మూడుచింతలపల్లి, ఎల్లంపేట్ మున్సిపాలిటీల పరిధిలోని మొత్తం ఐదు బార్ల కేటాయింపునకు ఈ...