మేడ్చల్ కలెక్టరేట్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

*కలెక్టరేట్‌లో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు* *ప్రకృతి పండుగ బతుకమ్మ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక* *జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక* మేడ్చల్, నేటి ప్రస్థానం:- బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ప్రకృతి పండుగ అని జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక అన్నారు. ప్రకృతిలో సహజంగా లభించే గునుగు, తంగేడు, బంతి, చామంతి తదితర రకాల పూలతో బతుకమ్మలను పేర్చి, పండుగ ముగిసిన అనంతరం ఆ పూలను నీటిలో నిమజ్జనం చేయడం ఈ పండుగ ప్రత్యేకత అని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిచ్చే...