prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 October 2026, 7:35 pm Digital Edition : MAHESH MEDCHAL

*మేడ్చల్‌లో విషాదం.. బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య*

*మేడ్చల్‌లో విషాదం.. బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య*

*కండ్లకోయలోని ప్రైవేట్ హాస్టల్‌లో ఘటన.. 19 ఏళ్ల అక్షయ మృతి*

మేడ్చల్, అక్టోబర్ 24 (పీపుల్స్ డైరీ): గుండ్ల పోచంపల్లి డివిజన్ పరిధిలోని కండ్లకోయలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సీఎంఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అక్షయ (19) ప్రైవేట్ హాస్టల్‌లో మృతి చెందింది. హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనతో విద్యార్థిని కుటుంబ సభ్యులు, పరిచయస్తుల్లో విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే.. కండ్లకోయలోని సీఎంఆర్ ఐటీలో అక్షయ బీటెక్ రెండో సంవత్సరం ఈసీఈ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్) చదువుతోంది. హాస్టల్‌లో ఉంటున్న ఆమె గదిలో మృతి చెంది ఉండటాన్ని గుర్తించినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం పోలీసులకు అందడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థిని మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆమె ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.