*మేడ్చల్‌లో ఆచార్య ముదిగొండ శివప్రసాద్ సంస్మరణ సభ*
*సాహిత్య, విద్యా రంగాలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం*
ù
మేడ్చల్, అక్టోబర్ 25 (ప్రజా వాణి):
చరిత్రాత్మక నవలా చక్రవర్తి, బహుముఖ ప్రజ్ఞాశాలి, అపార దేశభక్తి సంపన్నులు, ప్రముఖ ఆచార్యులు కీర్తిశేషులు డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ సంస్మరణ సభ ఆదివారం మేడ్చల్ పట్టణంలోని గ్రంథాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్త పడాల రఘురాములు పటేల్, రిటైర్డ్ ప్రిన్సిపాల్ డీసీ నరసింహులు, న్యాయవాది రాధాకృష్ణ, గ్రంథాలయ సిబ్బంది ప్రవల్లికతో పాటు విద్యార్థినీ విద్యార్థులు, వివిధ పాఠకులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆచార్య ముదిగొండ శివప్రసాద్‌కు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించి, సాహిత్య, విద్యా రంగాల్లో ఆయన అందించిన విశేష సేవలను స్మరించుకున్నారు. తెలుగు సాహిత్యంలో చారిత్రక నవలా రచయితగా ప్రత్యేక గుర్తింపు పొందిన ముదిగొండ శివప్రసాద్ తన రచనల ద్వారా చరిత్ర, సంస్కృతి, దేశభక్తి, సామాజిక విలువలను పాఠకులకు పరిచయం చేశారని వక్తలు గుర్తుచేసుకున్నారు. ఆయన సాహితీ ప్రయాణం, రచనా వైశిష్ట్యం, సమాజానికి అందించిన సందేశాలు తెలుగు సాహిత్య చరిత్రలో విశిష్ట స్థానాన్ని సంపాదించాయని పేర్కొన్నారు. చరిత్రాత్మక అంశాలను తన రచనల్లో ఆసక్తికరంగా ఆవిష్కరించి, పాఠకుల్లో చరిత్ర పట్ల అవగాహనను పెంపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని కొనియాడారు. రచయితగా, ఆచార్యుడిగా ఆయన అందించిన సేవలు సాహితీ ప్రియులకు, విద్యార్థులకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని తెలిపారు. ఆయన రచనలు భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని, తెలుగు సాహిత్యంపై ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ ఆయన సాహిత్యాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
సంస్మరణ సభలో పాల్గొన్న ప్రముఖులు, పాఠకులు, విద్యార్థులు ఆచార్య ముదిగొండ శివప్రసాద్‌తో తమకున్న సాహితీ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆయనకు నివాళులర్పించారు. ఆయన ఆశయాలు, సాహిత్య విలువలు సమాజంలో మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. సాహిత్య రంగానికి ఆయన చేసిన కృషిని భవిష్యత్ తరాలకు పరిచయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని పేర్కొన్నారు. మేడ్చల్ గ్రంథాలయ ఆవరణలో నిర్వహించిన ఈ సంస్మరణ సభలో సాహిత్యాభిమానులు, విద్యార్థులు, పాఠకులు పాల్గొని ఆచార్య ముదిగొండ శివప్రసాద్ సేవలను స్మరించుకోవడం విశేషంగా నిలిచింది. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన గ్రంథాలయ ఇన్‌చార్జి, సిబ్బందికి నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.