మృతురాలి కుటుంబానికి పరామర్శ
.ఆ కుటుంబానికి అండగా ఉంటాం.
. కలం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సర్వర్ అహ్మద్.
ములుగు జిల్లా ప్రతినిధి(ప్రజావాణి)
మృతురాలు నగరం సమ్మక్క కుటుంబానికి అండగా ఉంటామని కలం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మహ్మద్ సర్వర్ అహ్మద్ అన్నారు. మండలంలోని లక్ష్మీదేవి గ్రామానికి చెందిన నగరం సమ్మక్క ఇటీవల మృతి చెందగా, మృతురాలి కుమారుడు నగరం తిరుపతి కుటుంబాన్ని కలం ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరామర్శించారు. ఈ సందర్భంగా కలం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సర్వర్ అహ్మద్ ఆధ్వర్యంలో మృతురాలు సమ్మక్క చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం సర్వర్ అహ్మద్ మాట్లాడారు. మృతురాలు సమ్మక్క గ్రామానికి చేసిన సేవలు మరువలేని అని అన్నారు. ఆ కుటుంబానికి మేము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జెన్కో కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లం ఓదెలు యాదవ్. సీనియర్ జర్నలిస్ట్, నల్లబెల్లిసాంబయ్యపటేల్, గౌడ సంఘం నాయకులు కారుపోతుల దేవేందర్, చిట్టిబాబు, నాయకులు, పొట్లపల్లి సంపత్, షేక్ ఆసిఫ్, చేను నరేష్, నాయకులు బొడ్డుపల్లి స్వామి పెద్దపెల్లి రవి,కుమారు, రమేష్, చేన్న శీను, తదితరులు పాల్గొన్నారు