prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 October 2026, 7:57 pm Digital Edition : PRAJA VANI

ముల్కలపల్లి-గొల్లగూడెం బీటీ రోడ్డు పనులకు శ్రీకారం

*ముల్కలపల్లి-గొల్లగూడెం బీటీ రోడ్డు పనులకు శ్రీకారం…*

*కొబ్బరికాయ కొట్టి బీటీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య.*

*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 15*

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం ముల్కలపల్లి గ్రామం నుంచి గొల్లగూడెం గ్రామం వరకు గురువారం రోజున నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు ప్రభుత్వ విప్ , ఆలేరు శాసనసభ్యులు బీర్ల అయిలయ్య శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన కొబ్బరికాయ కొట్టి రోడ్డు నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే ముల్కలపల్లి , గొల్లగూడెం గ్రామాల ప్రజలకు రాక పోకలు మరింత సులభ తరం కానున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం ద్వారా ప్రజలకు ప్రయాణ ఇబ్బందులు తగ్గడంతో పాటు , రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను తరలించేందుకు , విద్యార్థులు , ఉద్యోగులు నిత్యం రాకపోకలు సాగించేందుకు సౌకర్య వంతంగా ఉంటుందని భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రహదారులు ఎంతో కీలకమని , ప్రజలకు మెరుగైన మౌలిక సదు పాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని విప్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. రోడ్డు నిర్మాణ పనులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణం గా చేపట్టి , నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్య క్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు , కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.